Kannappa: కన్నప్ప అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ప్రిన్సెస్ నెమలి మెస్మరైజింగ్ లుక్ విడుదల

by Hamsa |
Kannappa: కన్నప్ప అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ప్రిన్సెస్ నెమలి మెస్మరైజింగ్ లుక్ విడుదల
X

దిశ, సినిమా: మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’(Kannappa). ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తుండగా.. దీనిని ఎవా ఎంటర్‌టైన్‌మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్, మోహన్ లాల్(Mohanlal), మోహన్ బాబు వంటి స్టార్స్ నటిస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కన్నప్ప’ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ప్రతి సోమవారం ఓ పోస్టర్ విడుదల చేస్తామని ప్రేక్షకులకు మాట ఇచ్చారు. ఈ మేరకు ‘కన్నప్ప’ నటిస్తున్న పాత్రలను రివీల్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా, చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేస్తూ x ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ప్రీతి ముకుందన్(Preethi Mukundan) ప్రిన్సెస్ నెమలి పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ ఆమె ఫస్ట్ లుక్ షేర్ చేశారు. అలాగే ‘‘అందంలో సహజం, తెగింపులో సాహసం. ప్రేమలో అసాధారణం. భక్తిలో పారవశ్యం. కన్నప్పకి సర్వస్వం. చెంచు యువరాణి నెమలి’’ అనే క్యాప్షన్ జత చేసి హైప్ పెంచారు. అంతేకాకుండా మంచు విష్ణుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని ఆమె పాత్ర చాలా స్పెషల్ అని వెల్లడించారు. ఇందులో ప్రీతి గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి మెస్మరైజింగ్ లుక్‌లో కనిపించింది.

Advertisement
Next Story

Most Viewed