- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prabhas: సినిమా ఎలా ఉన్న ఆ లుక్స్ తేడా రావద్దు.. విష్ణుకి స్టార్ హీరో ఫ్యాన్ వార్నింగ్ (ట్వీట్)
దిశ, సినిమా: విష్ణు మంచు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ (Kannappa) రాబోతున్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు (Mohan Babu) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ (Promotional Content)తో మూవీపై భారీ హైప్‌ను క్రియేట్ చేశారు చిత్ర బృందం. ఇక ఇటీవల వచ్చిన టీజర్ కూడా నెట్టింట ఆకట్టుకుంది. భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది ఏప్రిల్ 25 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. కన్నప్ప నుంచి ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ఇస్తున్న అప్డేట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సినిమా నుంచి రిలీజ్ చేసిన పాత్రల పోస్టర్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై హైప్ మరింత క్రియేట్ అవుతోంది. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మోహన్ లాల్ (Mohan Lal)తో పాటు ప్రభాస్ (Prabhas), అక్షయ్ కుమార్ (Akshay Kumar), శరత్ బాబు (Sarath Babu) లాంటి స్టార్లు కూడా భాగమవుతున్నారు. దీంతో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్ మంచు విష్ణుని ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు.
‘అన్నా మంచు విష్ణు.. సినిమా ఎలా ఉన్నా పర్వలేదు. మా ప్రభాస్ అన్నా క్యారెక్టర్ & లుక్స్ తేడా రాకుండా చూసుకో. 5 సార్లు వెల్తా సినిమాకి’ అంటూ మంచు విష్ణుకి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు ప్రభాస్ అభిమాని. అయితే.. ఈ ట్వీట్‌పై స్పందించి మంచు విష్ణు ‘మై బ్రదర్.. 100% కచ్చితంగా చెప్తున్నాను. మీరు నా అన్న #ప్రభాస్ క్యారెక్టర్‌ని ఇష్టపడతారు. అలాగే ఆయన గురించి నేను మీకు మరింత చెప్పాలనుకుంటున్నాను. త్వరలో రివీల్ చేస్తాను. అప్పటి వరకు ఓపికపట్టండి’ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రజెంట్ ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.