దయచేసి వారి ఉచ్చులో పడకండి.. చాలా జాగ్రత్తగా ఉండాలంటూ టాలీవుడ్ నిర్మాత రిక్వెస్ట్

by Hamsa |   ( Updated:2025-02-21 12:38:28.0  )
దయచేసి వారి ఉచ్చులో పడకండి.. చాలా జాగ్రత్తగా ఉండాలంటూ టాలీవుడ్ నిర్మాత  రిక్వెస్ట్
X

దిశ, సినిమా: ఇటీవల చాలామంది సోషల్ మీడియాలో ఇన్ఫుయెన్సర్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న విషయం తెలిసిందే. కొందరు సోషల్ మీడియాలో రీల్స్ చూసే వాల్లు డబ్బులు వస్తాయన్న ఆశతో ఆ బెట్టింగ్ యాప్‌లో ఉచ్చులో పడి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. కొందరైతే ఇంట్లో చెప్పుకోలేక ఆ డబ్బులను ఎలా తీసుకురావాలో అర్థం కాక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకుంటూ అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇక ఈ విషయంపై పలువురు ప్రముఖులు అవగాహన కల్పించినప్పటికీ కొంతమందిలో మార్పు రావడం లేదు. ఈ బెట్టింగ్ యాప్‌ వల్ల చదువుకున్న వారు కూడా డబ్బులు పోగొట్టుకున్నవారెందరో ఉన్నారు. ఈ క్రమంలో.. తాజాగా, బెట్టింగ్ యాప్‌‌ల ఉచ్చులో పడకూడదని టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్(SKN) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘‘ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లలో డబ్బు పోగొట్టుకున్నామని సహాయం కోసం అభ్యర్థిస్తున్న వ్యక్తులు చాలా తక్కువ.

సోదరులారా దయచేసి ఈ యాప్‌లతో జాగ్రత్తగా ఉండండి. సులభంగా డబ్బు కోసం టెంప్ట్ అవకండి. ఈ యాప్‌లు దోచుకోవడానికి రూపొందించబడ్డాయి కానీ మీకు సహాయం చేయవు. ఈ ఉచ్చులో పడకండి.. కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోకండి’’ అని రాసుకొచ్చారు. కాగా, ఎస్‌కేఎన్ నిర్మించిన ‘బేబీ’(Baby) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. సాయి రాజేష్(Sai Rajesh) తెరకెక్కించిన ఈ మూవీలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ కలిసి నటించారు. ఇదిలా ఉంటే.. ఎస్‌కేఎన్ ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ‘డ్రాగన్’(Dragon) ప్రీరిలీజ్ ఈవెంట్‌లో భాగంగా ఆయన తెలుగు హీరోయిన్స్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. దీంతో ఇలా మాట్లాడటం దారుణం అని నెటిజన్లు ట్రోల్స్ చేశారు. దీంతో ఆయన సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. అవన్నీ సరదాకు చేసినవి కాబట్టి వివాదం చేయకండి అని అన్నారు.

Next Story

Most Viewed