- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా ఆఫీసులో టాలీవుడ్ స్టార్ హీరో ఫొటో.. చర్చనీయాంశంగా మారిన ఇన్‌స్టా పోస్ట్!

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన యాక్షన్, కామెడీ, డ్రామా, సెంటిమెంట్, మాస్, క్లాస్ ఇలా అన్ని కోణాల్లోనూ తన విశ్వరూపం చూపించి కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా చాలామంది ఆయనను ఇష్టపడతారనడంలో అతిశయోక్తి లేదు. చిరు కోసం కొంతమంది ప్రాణాలు కూడా ఇచ్చేందుకు రెడీగా ఉంటారు. ఇక ఈ లిస్ట్‌లోకి టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా చేరారు. తాజాగా, డైరెక్టర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఫొటోలో చిరంజీవి ఫొటోఫ్రేమ్ కనిపించింది. ఇంకా లోపల హాలీవుడ్ యాక్షన్ సినిమాల ఫ్రేమ్ ఉంటాయి. వీటి అన్నిట్లో చిరు ఫొటోఫ్రేమ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ఇక ఈ పోస్ట్‌కు ఆయన ‘‘భద్రకాళి ఆఫీస్’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) పోస్ట్ సోషల్ మీడియాలో సన్సేషనల్‌గా మారింది. మెగా అభిమానులు దానిని షేర్ చేస్తూ చిరు స్థాయి ఇది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా, చిరంజీవి కాంబోలో ఒక్క సినిమా వస్తే చూడాలని ఉందని అభిప్రాయపడుతున్నారు. కాగా, సందీప్ రెడ్డి విషయానికొస్తే.. అర్జున్ రెడ్డి(Arjun Reddy), మహానటి(Mahanati) వంటి చిత్రాలతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొద్ది కాలం పాటు డైరెక్షన్‌కు దూరంగా ఉన్నారు.
మళ్లీ 2023లో ‘యానిమల్’(Animal) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ తెచ్చుకున్నారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి గంగా, ప్రభాస్(Prabhas) కాంబోలో పాన్ ఇండియా మూవీ ‘స్పిరిట్’ (Spirit)రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథను రెడీ చేయడంలో ఆయన బిజీగా ఉన్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు.