Pawan Kalyan: పెద్దరికం అంటే పవన్ కల్యాణ్‌దే.. కస్తూరి శంకర్ ఆసక్తికర ట్వీట్

by Hamsa |   ( Updated:2025-01-01 12:47:19.0  )
Pawan Kalyan: పెద్దరికం అంటే పవన్ కల్యాణ్‌దే.. కస్తూరి శంకర్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, సినిమా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మీడియా చిట్ చాట్‌లో భాగంగా అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్ కరెక్ట్ అనే విధంగా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ‘‘గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారు. రేవతి మృతి చెందిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శిస్తూ అయిపోయేది. అక్కడే మానవతా దృక్పథం లోపించినట్లైంది. అల్లు అర్జున్ కాకపోయినా మూవీ టీమ్ వెళ్లినా బాగుండేది. చట్టం ఎవరికీ చుట్టం కాదు. ఓ హీరోని అరెస్ట్ చేశారు అంటే.. అది రేవంత్ రెడ్డి కాబట్టి అలా చేశారు.

ఒక సారి కేసు నమోదు అయ్యాక ఎవరైనా చట్టాల్ని ఫాలో అవ్వాల్సిందే. నా మీద కేసు పెట్టినా కూడా అలానే అరెస్ట్ చేస్తారు. నేను తప్పు చేసినా అరెస్ట్ చేయండి అని అసెంబ్లీలోనే చెప్పాను. చట్టం ముందు అందరూ సమానమే’’ అని చెప్పుకొచ్చారు. తాజాగా, ఈ విషయంపై నటి కస్తూరి శంకర్(Kasthuri Shankar) స్పందించి ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘‘పెద్దరికం అంటే పవన్ కళ్యాణ్‌దే. చాలా మెచ్యూరిటీ గా మాట్లాడారు. ఎలాంటి పక్షవాతం లేకుండా చెప్పారు. మనమందరం ఈ అల్లకల్లోలమైన విషాదాన్ని వదిలేసి వినయంగా 2025లోకి ప్రవేశిద్దాం’’ అని రాసుకొచ్చింది. అలాగే పవన్ చేసిన కామెంట్స్ షేర్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed