- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Nidhi Agarwal: ఆ ఇద్దరు స్టార్ హీరోల కారణంగా నిద్రలేని రాత్రులు గడిపాను.. వైరల్‌గా యంగ్ హీరోయిన్ కామెంట్స్

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) ప్రజెంట్ ‘ది రాజాసాబ్’ (The Rajasab), ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1-స్వార్డ్ vs స్పిరిట్’ (Harihara Veeramallu) చిత్రాలతో బిజీగా ఉంది. ఈ రెండు సినిమాల షూగింగ్‌లో ఒకేసారి పాల్గొంటున్న ఈ బ్యూటీ.. గత మూడేళ్లుగా మరో చిత్రం అనౌన్స్ చేయలేదు. అంతే కాకుండా.. ఈ రెండు చిత్రాల రిలీజ్ తర్వాత తన కెరీర్ మంచి మలుపు తిరుగుతుందని భావిస్తున్న నిధి అగర్వాల్.. ‘రాజాసాబ్, హరిహర వీరమల్లు’ చిత్రాల కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి.. ఈ సినిమా విశేషాలను పంచుకుంది.
‘గత రెండు నెలలుగా నేను నాన్ స్టాప్ (Non stop)గా షూటింగ్స్‌లో పాల్గొంటున్నాను. దానికి గ్రేట్ ఫుల్ (Great full)గా ఫీల్ అవుతున్నాను. ఎలాంటి కంప్లెయింట్స్ (Complaints) లేవు. పవన్ కల్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్‌తో ‘రాజాసాబ్’ సినిమాలు చేస్తున్నాను. రెండు సినిమాల చిత్రీకరణ నాన్ స్టాప్‌గా జరుగుతున్నాయి. దీంతో ఒకే రోజు రెండు సినిమాల షూటింగ్‌లో పాల్గొనాల్సి వస్తోంది. హాఫ్ డే విజయవాడ (Vijayawada)లో, హాఫ్ డే హైదరాబాద్ (Hyderabad)లో ఉంటున్నారు. 7- 12 గంటల వరకూ విజయవాడలో వీరమల్లు షూటింగ్ చేసి, మధ్యాహ్నం 2-3 గంటల మధ్య ఫ్లైట్‌లో హైదరాబాద్ వచ్చేదాన్ని. అనంతరం సాయంత్రం 4-10 గంటల వరకూ రాజాసాబ్ షూటింగ్‌లో పాల్గొన్నాను. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు కారులో హైదరాబాద్ నుంచి బయలుదేరి, ఉదయం 4 గంటలకు విజయవాడకు చేరుకునేదాన్ని ఎంత నిద్రపోయినా ఆ కార్లోనే, ఇదీ నా బిజీ షెడ్యూల్. అలా 10 రోజులు కంటిని నిద్ర లేకుండా, ఒంటికి రెస్ట్ లేకుండా షూటింగ్స్ చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది.