ట్రెడిషనల్ లుక్‌లో ఫిదా చేస్తున్న యంగ్ హీరోయిన్.. సో క్యూట్ అంటూ నెటిజన్ల కామెంట్స్

by Kavitha |
ట్రెడిషనల్ లుక్‌లో ఫిదా చేస్తున్న యంగ్ హీరోయిన్.. సో క్యూట్ అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’(Software Devoloper) వెబ్ సిరీస్‌తో మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీకి సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. అలా ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) సరసన ‘బేబీ’(Baby) మూవీలో నటించి తన యాక్టింగ్‌తో ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా ప్రస్తుతం స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘జాక్’(Jack) మూవీలో నటిస్తోంది.

అయితే దీనికి బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్(BVSN Prasad) నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తుంది. ఇక ఇందులో ప్రకాష్ రాజ్(Prakash Raj), బ్రహ్మాజీ(Brahmaji) వంటి వారు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.

అయితే వైష్ణవి చైతన్య సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా(Social Media)లో మాత్రం నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా వైష్ణవి చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో పింక్ కలర్ బ్లౌజ్ క్రీమ్ కలర్ శారీ కట్టుకుంది.

అలాగే చిన్న ఇయర్ రింగ్స్, ఒక చేతికి బ్రాస్‌లేట్ మరో చేతి ఫింగర్‌కి రింగ్ పెట్టుకుంది. అలా చాలా సింపుల్ లుక్‌లో ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story

Most Viewed