పెళ్లి కాకుండానే బిడ్డతో దర్శనమిచ్చి షాకిచ్చిన నేషనల్ క్రష్.. నా కిమ్చి అంటూ పోస్ట్

by Hamsa |
పెళ్లి కాకుండానే బిడ్డతో దర్శనమిచ్చి షాకిచ్చిన నేషనల్ క్రష్.. నా కిమ్చి అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా క్రేజ్ సంపాదించుకోలేక పోయింది. ఇక 2023లో వచ్చిన ‘యానిమల్’(Animal) సినిమాతో త్రిప్తి ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా నటించిన ఈ మూవీలో ఈ భామ జోయా(Zoya) పాత్రలో నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. తన నటనతో ఏకంగా స్టార్ హీరోయిన్ అంతటి పాపులారిటీని సొంతం చేసుకుంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లోనూ పలు ఫొటోలు షేర్ చేసి క్రేజీ బ్యూటీగా మారింది. యానిమల్‌తో త్రిప్తికి ఏకంగా నేషనల్ క్రష్ అనే హోదా కూడా లభించిన విషయం తెలిసిందే.

ఇక గత ఏడాది ‘భూల్ భులయ్యా’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన త్రిప్తి.. ప్రస్తుతం ఆషికి-2(Aashiqui-2), ధడక్-2 చేస్తుంది. అంతేకాకుండా తెలుగులోనూ పలు ఆఫర్లు అందుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది. అయినప్పటికీ నెట్టింట పలు పోస్టులు పెడుతూ రచ్చ చేస్తుంది. తాజాగా, త్రిప్తి పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె ఓ పాపతో కనిపించింది. నా కిమ్చి అనే క్యాప్షన్ జత చేసింది. అయితే ఆ పాప ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. దీంతో అది చూసిన నెటిజన్లు ఇలియానా లాగా పెళ్లి కాకుండా బిడ్డతో దర్శనమిచ్చి షాకిచ్చిందిగా అని అంటున్నారు. కానీ త్రిప్తి ఫ్యాన్స్ మాత్రం పెళ్లి కాకుంటే బిడ్డను ఎత్తుకోవడం తప్పు కాదు కదా అలాంటప్పుడు అలా అనడమేంటని? ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed