MOKSHAGNA: నందమూరి వారసుడి లేటెస్ట్ లుక్స్ వైరల్.. ఆకట్టుకుంటున్న ఫొటో(పోస్ట్)

by Kavitha |
MOKSHAGNA: నందమూరి వారసుడి లేటెస్ట్ లుక్స్ వైరల్.. ఆకట్టుకుంటున్న ఫొటో(పోస్ట్)
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ త‌న‌యుడు మోక్షజ్ఞ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో మోక్ష‌జ్ఞ సినిమా ఉండ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే అనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది. అయితే.. ఇంత వ‌ర‌కు ఈ చిత్రానికి సంబంధించిన మ‌రే అప్డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ మోక్ష‌జ్ఞ ఫొటోను పోస్ట్ చేశాడు. యాక్ష‌న్‌కు సిద్ధంగా ఉండండి అంటూ రాసుకొచ్చాడు. ద‌ర్శ‌కుడి కామెంట్ చూస్తుంటే.. ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది అని అర్థ‌మ‌వుతోంది.

ప్ర‌శాంత్ వ‌ర్మ పోస్ట్ చేసిన ఫొటోలో మోక్ష‌జ్ఞ లుక్ అదిరిపోయింది. ఇక మోక్ష‌జ్ఞ సినిమాలో ఈ లుక్‌లోనే కనిపిస్తారేమో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కాగా అందుతున్న సమాచారం ప్రకారం.. డిసెంబర్ 5 నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.



Next Story

Most Viewed