Mohanlal : ఎల్-2: ఎంపురాన్ నుంచి అప్‌డేట్ ఇచ్చిన మోహన్ లాల్.. న్యూ పోస్టర్ రిలీజ్

by sudharani |   ( Updated:2025-02-26 15:09:51.0  )
Mohanlal : ఎల్-2: ఎంపురాన్ నుంచి అప్‌డేట్ ఇచ్చిన మోహన్ లాల్.. న్యూ పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: మలయాళ (Malayalam) సూపర్ స్టార్ మోహ‌న్ లాల్ (Mohan Lal) ప్రధాన పాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఎల్-2: ఎంపురాన్’ (L-2: Empuran). బ్లాక్ బ‌స్టర్ చిత్రం లుసిఫ‌ర్ (Lucifer) సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహిస్తుండగా.. టోవినో థామస్ (Tovino Thomas), మంజు వారియర్ (Manju Warrior) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మార్చి 27న మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీంతో సినిమా నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఇటీవల టీజర్ (Teaser) రిలీజ్ చెయ్యగా.. సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చాడు మోహన్ లాల్. ఈ సినిమాలో ఆండ్రియా తివాడర్ (Andrea Tivadar) నటిస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ.. తన సోషల్ మీడియా అకౌంట్ X ద్వారా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘క్యారెక్టర్ నెం: 06.. ఎల్-2: ఎంపురాన్‌లో మిచెల్ మెనుహిన్ (Michele Menuhin) పాత్రలో ఆండ్రియా తివాడర్ నటిస్తుంది’ అంటూ ఆమెకు సంబంధించిన ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఆండ్రియా మిలిటరీ సూట్‌లో గన్ పట్టుకుని సీరియస్ లుక్‌లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటోంది.

Next Story