- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హమ్మయ్య.. ఎట్టకేలకు మెగా ప్రిన్సెస్ క్లింకార ఫేస్ రివీల్.. ఇంత క్యూట్‌గా ఉందేంటి బ్రో? (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్సెస్ క్లింకార(Mega Princess Klin Kaara) గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు ఆమె ఫేస్‌ను కుటుంబ సభ్యులకు తప్ప మరెవరికీ చూపించలేదు. అయినా ఆమె గురించి రోజూ నెట్టింట ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తారని ఇటీవల అన్‌స్టాపబుల్ షోలో నందమూరి బాలకృష్ణ స్వయంగా రామ్ చరణ్(Ram Charan)ను ప్రశ్నించగా.. ‘నన్ను ఎప్పుడు డాడీ అని పిలిస్తే.. అప్పుడు రివీల్ చేస్తాను’ అని చరణ్ రిప్లై ఇచ్చారు. ఈ చర్చ జరిగి సరిగ్గా నెల రోజులు కూడా గడవకముందే.. మెగా ప్రిన్సెస్ క్లింకార వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రామ్ చరణ్ తన కూతురిని ఎత్తుకొని నిల్చున్న వీడియోలను కొందరు నెట్టింట పోస్టు పెట్టారు. అది కాస్త వైరల్ కావడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్లింకార సూపర్ క్యూట్‌గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇన్ని రోజులు ఎదురుచూసిన దానికి ఫలితం దక్కిందంటూ మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు.
కాగా, ఇటీవల రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా(Game Changer Movie)లో నటించిన విషయం తెలిసిందే. దీనిని దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించాడు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా.. శ్రీకాంత్(Srikanth), అంజలి(Anjali), ఎస్‌జే సూర్య, బ్రహ్మానందం, సునీల్, జయరాం, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో రామ్ చరణ్ సినిమా చేస్తున్నారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్ మున్నాభాయ్, జగపతి బాబు సైతం యాక్ట్ చేయబోతున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది.