అతనికి స్పెషల్ విష్ చేస్తూ మంచి పనికి శ్రీకారం చుట్టిన మెగా కోడలు.. నెట్టింట ప్రశంసల జల్లు(పోస్ట్)

by Kavitha |
అతనికి స్పెషల్ విష్ చేస్తూ మంచి పనికి శ్రీకారం చుట్టిన మెగా కోడలు.. నెట్టింట ప్రశంసల జల్లు(పోస్ట్)
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సతీమణి కొణిదెల ఉపాసన(Upasana) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన భర్తకు సంబంధించిన ఫొటోలతో పాటు తన కూతురు అయినటువంటి క్లీంకార(Klinkara) ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను పెంచుకుంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు మంచి పనులు చేసి వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి గుడ్ హార్ట్ అనిపించుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో అపోలో ఆస్పత్రుల అధినేత, తన తాత ప్రతాప్ రెడ్డి(Prathap Reddy) జన్మదినం సందర్భంగా ఉపాసన ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ మేరకు పిఠాపురంలో సహాయక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే మహిళా, శిశు సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. గర్భిణీలు, శిశువుల్లో పోషకాహార లోపం నివారించేలా చూడనున్నట్లు పేర్కొన్నారు. తొలుత పిఠాపురంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించి అనంతరం వివిధ ప్రాంతాలకు విస్తరించనున్నట్లు వెల్లడించారు. 'ప్రసూతి, శిశు మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అనంతరం మహిళలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, మహిళా సాధికారతలో భాగంగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నైపుణ్యాల పెంపుదలపై అవగాహన కల్పిస్తాం' అని ఉపాసన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. వదినమ్మ నీది గుడ్ హార్ట్ అంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు.

కాగా పిఠాపురం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గమన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీ మేరకు అక్కడ అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఇక్కడ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టేందుకు ముందుకొచ్చారు. అయితే మెగా ఫ్యామిలీ సభ్యులు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి, పలు సహాయ కార్యక్రమాలకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా, మెగా కోడలు కొణిదెల ఉపాసన (Konidela Upasana) సైతం చిన్న మామ పవన్ కళ్యాణ్‌కు అండగా.. పిఠాపురంలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed