- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Vishwak Sen: ‘లైలా’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మాస్ కా దాస్.. పోస్టర్‌తోనే బిగ్ షాకిచ్చాడుగా! (ట్వీట్)

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) గత ఏడాది ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’(Gang of Godavari) సినిమాతో హిట్ అందుకున్నారు. అదే ఫామ్‌తో వరుస చిత్రాలు ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా సినిమా ‘లైలా’(Laila). ఈ మూవీని రామ్ నారాయణ్ దర్శకత్వంలో రాబోతుంది. అయితే ఇందులో ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ పిక్చర్స్(Shine Screen Pictures), ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే సరికొత్త కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఎన్నడూ లేని విధంగా అమ్మాయి గెటప్‌లో లైలాగా, సోనూ మోడల్‌గా రెండు పాత్రల్లో నటిస్తున్నారు.
‘లైలా’ భారీ అంచనాల మధ్య వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తూ హైప్ పెంచారు. అలాగే వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, విశ్వక్ సేన్ ‘లైలా’ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఫిబ్రవరి 6న విడుదల కాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా లైలా, సోనూ మోడల్ పోస్టర్‌ను షేర్ చేశారు. అయితే ఇందులో బ్యూటీ పార్లర్‌లో విశ్వక్ సేన్ మేకప్ ఆర్టిస్ట్‌గా ఉండి బ్రష్, హెయిర్ డ్రైయ్యర్ పట్టుకుని కనిపించారు. వెనకా అన్ని మేకప్‌కు సంబంధించిన వస్తువులు ఉండగా.. కుర్చీలో లైలా షాక్ అవుతున్నట్లు ఉన్న లేడీ గెటప్‌లో మాస్ కా దాస్ ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇక అది చూసిన వారంతా నిజంగా అమ్మాయిలా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.
SONU MODEL 🤙🏻 and LAILA 💋 are coming with the BIGGEST LAUGH RIOT 💥💥#LailaTrailer out on February 6th ❤️🔥#Laila GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th 🌹
— VishwakSen (@VishwakSenActor) February 4, 2025
@RAMNroars #AkankshaSharma @sahugarapati7 @Shine_Screens @leon_james @JungleeMusicSTH @MediaYouwe pic.twitter.com/i3Etzo5MOc