Manchu Vishnu: ‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది.. కానీ మొరగడంలో తేడా ఉంది’.. మంచు విష్ణు ఆసక్తికర ట్వీట్

by Hamsa |
Manchu Vishnu: ‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది.. కానీ మొరగడంలో తేడా ఉంది’.. మంచు విష్ణు ఆసక్తికర ట్వీట్
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో మోహన్ బాబు(Mohan Babu), మనోజ్(Manoj) ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్ట్‌పై దాడి చేశారు. అయితే ఈ కేసు కోర్టు వరకు వెళ్లగా.. గాయపడిన బాదితుడికి నష్టపరిహారం చెల్లించడానికి అంగీకరించారు. ఇక ఈ సంక్రాంతి పండుగను కూడా మంచు మనోజ్ మోహన్ బాబు ఇంటికి వెళ్లలేదు. ఇక ఇటీవల రంగంపేటలోని యూనివర్సీటికి వెల్లడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. అయితే మంచు ఫ్యామిలీ వివాదం రోజు రోజుకు ముదురుతోంది తప్ప సద్దుమణగడం లేదు.

ఇక ఈ గొడవ నేపథ్యంలో.. తాజాగా, మంచు విష్ణు(Manchu Vishnu) సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘నా ఫేవరేట్ డైలాగ్స్‌లో ఇది ఒకటి. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను అందించారు. ఇందులో ప్రతి డైలాగ్ ఒక స్టేట్‌మెంట్. మోహన్ బాబు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా షేర్ చేస్తున్నా’’ అని రాసుకొచ్చారు. అలాగే రౌడీ మూవీలో మోహన్ బాబు చెప్పిన ‘‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ’ అనే డైలాగ్‌‌ను షేర్ చేశారు. ఇక అది చూసిన వారంతా మంచు మనోజ్‌ను ఉద్దేశించి పెట్టాడని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

Next Story