రీరిలీజ్‌కు సిద్ధమైన మంచు విష్ణు బ్లాక్ బస్టర్ మూవీ.. థియేటర్స్‌లోకి ఎప్పుడు రానుందంటే?

by Hamsa |
రీరిలీజ్‌కు సిద్ధమైన మంచు విష్ణు బ్లాక్ బస్టర్ మూవీ.. థియేటర్స్‌లోకి ఎప్పుడు రానుందంటే?
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిత్యం ఏదో ఒక సినిమా విడుదలవుతూ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. పెద్ద చిత్రాలు ఎక్కువగా లేకపోవడంతో డబ్బింగ్ సినిమాలే వస్తున్నాయి. దీంతో టాలీవుడ్ స్టార్స్ నటించిన మూవీస్ వెకెండ్స్‌కు విడుదలై బాక్సాఫీసును షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో చిత్రాలు రీరిలీజ్ అయి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, మంచు విష్ణు (manchu vishnu) తన హిట్ సినిమాను రీరిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శ్రీను వైట్ల(Sreenu Vaitla) దర్శకత్వంలో వచ్చిన ‘ఢీ కొట్టి చూడు’ మూవీని మార్చి 28న మరోసారి థియేటర్స్‌లోకి రానుంది.

జెనిలియా (Genelia)హీరోయిన్‌గా నటించిన ఈ యాక్షన్ కామెడీ సినిమాలో శ్రీహరి కీలక పాత్రలో నటించారు. అయితే ‘ఢీ’ 2007లో విడుదలై హిట్ అందుకుని మంచి వసూళ్లను రాబట్టి మంచు విష్ణు కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ థియేటర్స్‌లోకి రాబోతుండటం విశేషం. కాగా, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీలో అక్షయ్ కుమార్, మోహన్ బాబు, ప్రభాస్, అవ్రామ్, శరత్ కుమార్. కాజల్ అగర్వాల్, మోహన్ లాల్(Mohanlal), మంచు విష్ణు వంటి వారి నటిస్తున్నారు. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ అన్ని ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే ‘కన్నప్ప’ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 25న థియేటర్స్‌లోకి రానుంది.



Next Story

Most Viewed