- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kannappa: ‘కన్నప్ప’ అప్డేట్ రాబోతుందంటూ కీలక ప్రకటన విడుదల చేసిన మంచు విష్ణు.. (ట్వీట్)

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu)డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎవా ఎంటర్‌టైన్‌మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ(24 Frames Factory) బ్యానర్స్‌పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. అయితే ఇందులో శరత్ కుమార్(Sharath Kumar), మధుబాల, దేవరాజు, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంగా, అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్, మోహన్ లాల్(Mohanlal), వంటి స్టార్స్ ఇందులో భాగం అయ్యారు.
‘కన్నప్ప’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ 25న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. దీంతో మూవీ మేకర్స్ అప్పుడే ప్రమోషన్స్ మొదలెట్టి వరుస అప్డేట్స్ ఇస్తూ హైప్ పెంచుతున్నారు. ఈ మేరకు ప్రతి సోమవారం ‘కన్నప్ప’(Kannappa) సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘కన్నప్ప’ (Kannappa)అప్డేట్ రాబోతున్నట్లు తెలుపుతూ మంచు విష్ణు కీలక ప్రకటన విడుదల చేశారు. ‘‘వన్నకం చెన్నై.. ‘కన్నప్ప’ అప్డేట్ ఇవ్వబోతున్నాను అని చెప్పడానికి ఎక్టైటింగ్‌గా ఉన్నాను. గ్లింప్స్ రాబోతున్నాయి’’ అని రాసుకొచ్చారు.
— Vishnu Manchu (@iVishnuManchu) January 18, 2025