దానిని ఎవరూ పట్టించుకోరు.. కన్నప్ప మూవీపై మంచు మనోజ్ పరోక్ష విమర్శలు!

by Gantepaka Srikanth |   ( Updated:2025-02-13 15:20:58.0  )
దానిని ఎవరూ పట్టించుకోరు.. కన్నప్ప మూవీపై మంచు మనోజ్ పరోక్ష విమర్శలు!
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు ఫ్యామిలీ(Manchu Family)లో నెలకొన్న వివాదం కొలిక్కి రావడం లేదు. రోజు రోజుకూ ముదురుతోంది తప్ప.. ముగింపు పలికేలా ఎవరూ వ్యవహరించడం లేదు. తాజాగా.. ఈ అంశంపై మంచు మనోజ్(Manchu Manoj) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం జగన్నాథ్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు మనోజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. పరోక్షంగా మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న కన్నప్ప సినిమా(Kannappa Movie)పై విమర్శలు చేశారు. సినిమా బడ్జెట్‌ ఎంత అనేది ఎవరూ చూడరు. సినిమా బాగుందా..? లేదా అనేది కీలకమని మంచు మనోజ్ వ్యాఖ్యానించారు. నన్ను ఏం చేసినా అభిమానుల గుండెల నుంచి వేరుచేయలేరు. నేను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోను.. న్యాయం కోసం ఎంతదూరమైనా వెళ్తానని మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. మంచు ఫ్యామిలీ ఆశలన్నీ కన్నప్ప చిత్రంపైనే పెట్టుకున్నారు. ఇటీవల మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన సన్ ఆఫ్ ఇండియా, మోసగాళ్లు చిత్రాలు అనుకున్న రేంజ్‌లో రాణించలేకపోయాయి. దీంతో భారీ బడ్జెట్‌తో అన్ని భాషల ప్రముఖులతో కన్నప్ప చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగు నుంచి ప్రభాస్(Prabhas), మలయాళం నుంచి మోహన్ లాల్(Mohanlal), బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్(Akshay Kumar) వంటి కీలక నటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

మరోవైపు జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్‌ బాబు(Mohan Babu)కు సుప్రీంకోర్టు(Supreme Court)లో ఊరట లభించింది. మోహన్‌ బాబుకు ముందస్తు బెయిల్ ఇస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2024 డిసెంబరు 10వ తేదీన జల్ పల్లిలోని తన ఇంటి వద్ద మోహన్ బాబు ఒక మీడియా ప్రతినిధిపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed