- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Malavika Mohanan: సీనియర్ హీరోతో రొమాన్స్‌కు రెడీ అయిన యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్..

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) ప్రజెంట్ ‘ది రాజాసాబ్’ (The Rajasab) చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ఈ మూవీకి మారుతీ దర్శకత్వం వహిస్తు్న్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాళవిక మోహనన్ ఈ మూవీ కోసం ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ‘ది రాజాసాబ్’తో పాటు ఈ బ్యూటీ తమిళ స్టార్ హీరో కార్తీ (Karti) హీరోగా నటిస్తున్న ‘సర్ధార్ 2’ (Sardhar 2) లో కూడా నటిస్తుంది.
ఇలా ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు ఓ స్టార్ హీరోతో రొమాన్స్ చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. మాలీవుడ్ (Mollywood) స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) ‘హృదయపూర్వం’లో మాళవిక మోహనన్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. ఇక ఈ బ్యూటీ తన కెరీర్‌లో తొలిసారి సీనియర్ హీరోతో రొమాన్స్ చేసేందుకు సిద్ధం కావడంతో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా.. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతన్న ‘హృదయపూర్వం’ చిత్రానికి సత్యన్ అంథిక్కడ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఫిబ్రవరి 10 నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఇందులో సంగీత, సిద్దిఖీ, సంగీత్ ప్రతాప్, నిషాన్, లలు అలెక్స్, జనార్ధనన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.