ఆ స్టార్ హీరోతో రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు చెల్లెలు.. 15 ఏళ్లుగా అతనితో ప్రేమలో ఉన్నానంటూ..

by Kavitha |   ( Updated:2025-01-31 10:37:43.0  )
ఆ స్టార్ హీరోతో రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు చెల్లెలు.. 15 ఏళ్లుగా అతనితో ప్రేమలో ఉన్నానంటూ..
X

దిశ, సినిమా: పూరి జగన్నాథ్(Poori Jagannath) డైరెక్షన్‌లో మాస్ మహారాజ రవితేజ(Raviteja) హీరోగా వచ్చిన “నేనింతే”(Neninthe) అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అభినయ(Abhinaya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అందంలో హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోని ఈ బ్యూటీ పుట్టికతోనే మూగ, చెవుడు. అయినప్పటికీ నటి కావాలన్న తన కోరికను ధృడ సంకల్పంతో నెరవేర్చుకుంది. తండ్రి కూడా నటుడే అవడం ఆమెకు కొంతమేర కలిసి వచ్చింది. అలా తమిళంలో ప్రముఖ డైరెక్టర్ సముద్ర ఖని(samudra Khani) దర్శకత్వం వహించిన “నాడోడిగళ్”(Nadodigal) చిత్రం ద్వారా అభినయ తన సినీ కెరీర్ స్టార్ట్ చేసింది.

అయితే ఈభామ హీరోయిన్‌గా సినిమాలు చేయకపోయినా సహాయక పాత్రల్లో కనిపించి మెప్పించింది. అలా “శంభో శివ శంభో”(Shambho Shiva Shambho) సినిమాలో రవితేజ చెల్లెలిగా నటించి మెప్పించింది. అలాగే ‘దమ్ము’(Dammu) చిత్రంలో జూనియర్ ఎన్.టి.ఆర్‌(NTR)కు సోదరి పాత్రను పోషించింది. వెంకటేష్(Venkatesh), మహేష్ బాబు(Mahesh Babu) నటించిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”(Seethamma Vakitlo Sirimalle Chettu) చిత్రంలో వారికి సోదరిగా నటించింది. ఇలా ఎన్నో సినిమాల్లో అభినయ అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఇదిలా ఉంటే.. అప్పట్లో ఆమె స్టార్ హీరో విశాల్‌(Vishal)తో ప్రేమలో ఉందంటూ పుకార్లు నెట్టింట షికార్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే దానిపై ఈ అమ్మడు స్పందించింది ఆసక్తికర కామెంట్స్ చేసింది. అభినయ మాట్లాడుతూ.. ‘ విశాల్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నా అభిమాన నటుడు. అతన్ని చూసి చాలా నేర్చుకున్నా. కానీ, మా ఇద్దరి గురించి వస్తున్న వార్తలు వింటుంటే చాలా బాధగా అనిపిస్తోంది. ఆ రూమర్స్‌లో ఏమాత్రం నిజం లేదు, విశాల్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే.

నిజానికి నేను 15 ఏళ్లుగా కలిసి చదువుకున్న స్నేహితుడిని ప్రేమిస్తున్నాను. అంతేకాదు త్వరలో అతడిని పెళ్లి కూడా చేసుకోబోతున్నాను’ అని చెప్పుకొచ్చింది. అయితే తన ప్రియుడి పేరును మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఫైనల్‌గా విశాల్‌తో ఉన్న రిలేషన్‌పై పూర్తిగా క్లారిటీ వచ్చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా ప్రస్తుతం అభినయ ‘పని’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.


Read More..

అల్లు అరవింద్ నాకు తండ్రితో సమానం.. నేచురల్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. ఆందోళనలో ఫ్యాన్స్

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed