ప్రపంచ రికార్డు సృష్టించిన మహేష్ బాబు మూవీ.. వరల్డ్‌లోనే ఏకైక సినిమాగా ఘనత..

by Kavitha |   ( Updated:2025-03-20 14:54:54.0  )
ప్రపంచ రికార్డు సృష్టించిన మహేష్ బాబు మూవీ.. వరల్డ్‌లోనే ఏకైక సినిమాగా ఘనత..
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu)- త్రివిక్రమ్(Trivikram) కాంబోలో తెరకెక్కిన సినిమా 'అతడు'(Athadu). స్టార్ బ్యూటీ త్రిష నటించిన ఈ మూవీ 2005లో రిలీజ్ అయి అప్పట్లో మిక్స్​డ్ టాక్ దక్కించుకుంది. అయితే థియేటర్లలో ఫర్వాలేదనిపించిన ఈ చిత్రం, టెలివిజన్​లో మాత్రం దుమ్ముదులిపేసింది. రాను రానూ ఈ సినిమా తెలుగు ఇళ్లల్లో అందరి ఫేవరెట్​గా మారిపోయింది అని అనడంలో ఏమాత్రం సందేహం లేకుండా పోయింది. ఈ క్రమంలో 'అతడు' మూవీ వరల్డ్​ రికార్డు​ కొట్టింది.

ఇందులో భాగంగా ఈ సినిమా ఇప్పటివరకూ టీవీలో ఏకంగా 1500 సార్లు టెలికాస్ట్ అయిందట. అది కూడా వేసిన ప్రతి సారి అదిరిపోయే టీఆర్పీ సాధిస్తూ వచ్చింది. ఇప్పటివరకూ ఏ సినిమా కనీసం టీవీలో 1000 సార్లు కూడా టెలికాస్ట్ అయిన సందర్భాలు లేవని చెబుతున్నారు. అలాంటి ఈ చిత్రం 1500 సార్లు టెలికాస్ట్ చేశారంటే దాని గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఇప్పటివరకూ త్రివిక్రమ్ తీసిన చిత్రాల్లో ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనగానే గొర్చొచ్చే చిత్రం ఇది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

READ MORE ...

జాక్ నుంచి 'కిస్' సాంగ్ రిలీజ్.. రొమాంటిక్ లిరిక్స్‌తో మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటుందిగా..


Advertisement
Next Story