- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ట్రెడిషనల్ లుక్‌లో వావ్ అనిపిస్తున్న లిల్లీ.. సీతారామం బ్యూటీ రియాక్షన్ ఇదే..

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) నటించిన ‘అఆ’(A AA) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మనుపెన్నడు కనిపించని గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్లును ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’(JSK), ‘పరదా’(Paradha) వంటి సినిమాలు ఉన్నాయి.
అయితే రీసెంట్‌గా ఈ భామ నటించిన‘డ్రాగన్’ మూవీ థియేటర్లలో రిలీజ్ అయి.. మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఇందులో తమిళ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరోగా నటించగా.. ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మరి ముత్తు(Ashwath Marimuthu) దర్శకత్వం వహించారు. అలాగే ‘పరదా’ లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతుంది. దీనికి ‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక ఇందులో అనుపమ పరమేశ్వరన్, మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్(Darshana Rajendran), సీనియర్ నటి సంగీత(Sangeetha) ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అయితే J.S.K మూవీకి ప్రవీణ్ నారాయణ(Praveen Narayana) దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కాస్మోన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై జె ఫణీంద్ర కుమార్(J. Phanindra Kumar) నిర్మిస్తున్నారు. అలా ఓ పక్క వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా(social Media)లో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో, వ్యక్తిగత విషయాలతో ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉంది.
ఈ క్రమంలో ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా అనుపమ తన ఇన్‌స్టా గ్రామ్‌లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో శారీ కట్టుకుని ట్రెడిషనల్ లుక్‌లో ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. తన అందాలతో కుర్రకారుని మెస్మరైజ్ చేస్తుంది. దీంతో ఈ పోస్ట్ కాస్టా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు వావ్ సూపర్ అంటుండగా.. ‘సీతారామం’(Seetharamam) బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ‘ఏంజెల్’ అని హార్ట్ సింబల్ జోడించింది. మరి మీరు ఓ సారి ఈ ఫొటోస్‌పై ఓ లుక్ వేసేయండి.