- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Killer: జగతి మూవీ ‘కిల్లర్’పై కీలక అప్‌డేట్.. పోస్టర్ వైరల్

దిశ, సినిమా: ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్ పీస్’ వంటి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ పూర్వాజ్ (Purvaj) ‘కిల్లర్’ (Killer) అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ (Sci-fi action) థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇందులో ఆయన హీరోగా నటిస్తుండగా.. ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఫేమ్ జ్యోతి పూర్వజ్ (Jyoti Purvaj) హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే విశాల్ రాజ్, గౌతమ్ కూడా హీరోలుగా యాక్ట్ చేస్తున్నారు. ఏయు అండ్ఐ అండ్ మెర్జ్‌ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి.
అయితే.. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ (Regular shooting) శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ (Interesting update) ఇచ్చారు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ మూవీ మూడో షెడ్యూల్ (Third schedule) షూటింగ్ జరుపుకుంటుందని తెలుపుతూ.. ఇందులో లీడ్ ఆర్టిస్టులంతా పాల్గొంటునట్లు, సినిమాలోని కీలక సన్నివేశాలను ఈ తాజా షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నట్టు చెప్పుకొస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. కాగా.. లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో రూపొందుతున్న ‘కిల్లర్’ చిత్రం సరికొత్త సై-ఫై యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు మెమొరబుల్ ఎక్సిపీరియన్స్ ఇవ్వనుందని దీమా వ్యక్తం చేస్తున్నారు మూవీ యూనిట్.