‘శర్వా-37’ నుంచి లేటెస్ట్ అప్డేట్.. టైటిల్, ఫస్ట్ లుక్ కోసం రెడీగా ఉండండంటూ పోస్టర్

by Kavitha |   ( Updated:2025-01-02 15:25:34.0  )
‘శర్వా-37’ నుంచి లేటెస్ట్ అప్డేట్.. టైటిల్, ఫస్ట్ లుక్ కోసం రెడీగా ఉండండంటూ పోస్టర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, ‘సామజవరగమన’ మూవీ ఫేమ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘శర్వా 37’వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎమోషనల్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘శర్వా 37’ సినిమాకు సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కోసం రెడీగా ఉండండి అంటూ మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక పోస్టర్‌ను చూసినట్లయితే.. చేతిలో బాక్సింగ్ గ్లౌజ్‌లు పట్టుకొని ఒక సైడ్ నుంచి హీరో కోపంగా చూస్తున్నట్లు ఉండగా.. పక్కనే రెండు బెంచీలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట ఆకట్టుకుంటుంది.


Click Here For Tweet..

Advertisement

Next Story