- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Yash: యశ్ ‘టాక్సిక్’ లో స్టార్ హీరోయిన్.. కన్ఫర్మ్ చేస్తూ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (వీడియో)

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో యశ్(Yash) ‘కేజీఎఫ్-1’ కేజీఎఫ్-2 వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించి దేశవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రస్తుతం, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్(Geethu Mohandas) డైరెక్షన్‌లో ‘టాక్సిక్’(Toxic) మూవీ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్(KVN Productions) బ్యానర్‌పై నిర్మిస్తోంది. అయితే ఇందులో అక్షయ్ ఒబెరాయ్(Akshay Oberoi) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
అయితే ఇటీవల యశ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ‘టాక్సిక్’ గ్లింప్స్ విడుదల చేసి హైప్ పెంచిన విషయం తెలిసిందే. దీంతో ‘టాక్సిక్’ లో నటించే నటీనటుల గురించి అందరిలో క్యూరియాసిటీ పెరిగింది. ఈ క్రమంలో.. తాజాగా, ఇందులో ఓ స్టార్ హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు అక్షయ్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘ప్రస్తుతం నేను రాకింగ్ స్టార్ యశ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాను.
ఇందులో నయనతార(Nayanthara) కూడా నటిస్తున్నారు. ఇంతకు మించి వివరాలు నేను ఇప్పుడే వెల్లడిస్తే బాగోదు కాబట్టి మీరు నన్ను ఎక్కువగా అడగకండి. త్వరలోనే గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) ఓ కీలక ప్రకటన విడుదల చేసి చెప్తారు. అప్పటి వరకు వేచి చూడండి’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అక్షయ్ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు నయన్, యశ్ సరసన నటిస్తుందా.. లేక ఇతర పాత్రలో నటించబోతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.