Lady Comedian: మగ బిడ్డకు జన్మనిచ్చిన లేడీ కమెడియన్.. వైరల్ అవుతున్న ఫోటోలు

by Prasanna |   ( Updated:2025-01-21 12:57:10.0  )
Lady Comedian: మగ బిడ్డకు జన్మనిచ్చిన లేడీ కమెడియన్.. వైరల్ అవుతున్న ఫోటోలు
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళ్ సినిమాల్లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఇంద్రజ శంకర్ ( Indraja Shankar ) 2024 లో డైరెక్టర్ కార్తీక్ ( Karthik ) ని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. తాజాగా, ఈ ముద్దుగుమ్మ మగ బిడ్డకు ( Baby Boy ) జన్మనిచ్చింది. తనకు బాబు పుట్టాడని ఇంస్టాగ్రామ్ వేదికగా తెలిపింది.

ఈమె ఎవరో కాదు తమిళ నటుడు రోబో శంకర్ కూతురే ఇంద్రజ. విజయ్ హీరోగా నటించిన బిగిల్ మూవీతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పాగల్, విరుమాన్.. లాంటి మూవీస్ లో నటించి అందర్ని అలరించింది. అంతే కాదు, పలు టీవీ షోలు కూడా చేసింది.

తన ఫ్యామిలీకి దగ్గర బంధువైన డైరెక్టర్ కార్తీక్ ని గతేడాది వివాహం చేసుకుంది. తాను ప్రగ్నెంట్ అని ప్రకటించిన తర్వాత ఓ షో నుంచి మధ్యలోనే తప్పుకుంది. ప్రగ్నెంట్ అయ్యాక కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంది ఇంద్రజ. ఈమె శ్రీమంతం ఫోటోలు కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఇక, ఇప్పుడు మగ బిడ్డకు జన్మనిచ్చింది. తన భర్త కార్తీక్ చేతిలో తన చెయ్యితో పాటు పుట్టిన బాబు చేతిని పట్టుకుని ఉన్న ఫొటోని తన షేర్ చేసి.. తనకు అబ్బాయి పుట్టాడు అని తెలిపింది. దీంతో అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు కంగ్రాట్స్ అంటూ విషెస్ తెలుపుతున్నారు.

Next Story

Most Viewed