Keerthy Suresh: పెళ్లైన నెలరోజులకే షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన కీర్తి సురేష్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే! (పోస్ట్)

by Hamsa |
Keerthy Suresh: పెళ్లైన నెలరోజులకే షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన కీర్తి సురేష్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే! (పోస్ట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) ‘నేను లోకల్’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ‘మహానటి’ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. సావిత్రి పాత్రలో నటించిన ఆమె తన అందం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిందనడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్ స్టార్స్ సరసన నటించి తెలుగు ఇండస్ట్రీలో రాణిస్తుంది. అలాగే తమిళ, హిందీ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. గత ఏడాది ‘కల్కి’(Kalki)లో బుజ్జీకి వాయిస్ ఓవర్ ఇచ్చిన ఆమె ‘బేబీ జాన్’(Baby John)లో హీరోయిన్‌గా నటించింది.

ఇక ఈ మూవీ విడుదల సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తటిల్‌(Anthony Thattil)ను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హనీమూన్‌కు వెళ్లకుండా కీర్తి ‘బేబీ జాన్’ ప్రమోషన్స్‌లో పసుపుతాడుతో కనిపించి అందరిచేత ప్రశంసలు అందుకుంది. అంత కష్టపడినప్పటికీ ‘బేబీ జాన్’ బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. ఇక సినిమాలకు కాస్త గ్యాప్ ఆమె భర్తతో వెకేషన్స్‌కు వెళ్తూ నెట్టింట ఫొటోలు షేర్ చేస్తోంది. తాజాగా, కీర్తి, ఆంటోని కలిసి గోవా వెళ్లారు. ఆమె ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఇందులో ఆమె తాళి బొట్టు లేకుండా కనిపించి అందరికీ షాకిచ్చింది. పెళ్లన కానుంచి సంప్రదాయ లుక్‌లో కనిపించిన ఆమె ఎద, నడుము అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఇక ఈ పిక్స్ చూసిన వారు కొందరు తాళి ఎక్కడ అని కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు నెల రోజులు కూడా కాకుండానే తీసేసి పక్కన పడేసావా అని అంటున్నారు.

Next Story

Most Viewed