- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kareena Kapoor: ఇకపై శృంగార సన్నివేశాల్లో నటించను.. స్టార్ హీరోయిన్ కామెంట్స్

దిశ, సినిమా: బాలీవుడ్(Bollywood)లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కరీనా కపూర్ (Kareena Kapoor) ఒకరు. ఈ బ్యూటీ ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నీ దాదాపు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు.. అనేక అవార్డులు కూడా అందుకుంది. అలాగే రొమాంటిక్, కామెడీ, క్రైం డ్రామాల వరకు అన్నీ క్యాటగిరీస్‌లో తన బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన కరీనా ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంగ్లీష్ మ్యాగ్‌జైన్(English Magazine)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రొమాంటిక్ సీన్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘ఇకపై రొమాంటిక్ సీన్స్(Romantic scenes)లో నటించను. ఎందుకంటే ఇలాంటి సీన్స్ తెరపై ఉంచే ముందు దానిని మరింత లోతుగా చూడటం, గౌవరవించడం స్టార్ట్ చెయ్యాలి. సినిమా కథలో శృంగారం ఉండటం చాలా కామన్. అలాగే ఆ శృంగారం అనేది కథలో భాగంగా ఉండాలి. కానీ ఇటీవల కొంత మంది మాత్రం.. కేవలం శృంగారాన్ని హైలేట్ చేసి.. సినిమాను ముందుకు తీసుకెల్లే ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి శృంగార పాత్ర అనేది సినిమాను ముందుకు తీసుకెళ్లలేదని భావిస్తాను. ఒక రకంగా సినిమాలో అవసరం లేకున్న.. శృంగారం చేయాల్సి వస్తే నాకు చాలా ఇబ్బందిగా అన్పిస్తుంది. అంతే కాదు.. మన దేశంలో శృంగార పాత్రలను అంత ఓపెన్ మైండ్‌తో ఎవరు చూడరు. దీంతో సొసైటీ(Society)లో ఇబ్బందులు, సోషల్ మీడియాలో ట్రోల్స్ (Trolls on social media) జరుగుతుంటాయి. కానీ విదేశాల్లో అలా కాదు.. అక్కడి వారు శృంగార పాత్రలను నార్మల్‌గా ఎంజాయ్ చేస్తారు’ అంటూ చెప్పుకొచ్చింది.
READ MORE ...
Kartik Aaryan: కార్తీక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్.. IIFA లో కన్ఫామ్ చేసిన హీరో తల్లి?