Kangana Ranaut : వాటితో ఎలాంటి ఉపయోగం లేదు అనుకున్న.. మా అమ్మ చెప్పిన వినిపించుకోలేదు.. హీరోయిన్ కామెంట్స్

by sudharani |
Kangana Ranaut : వాటితో ఎలాంటి ఉపయోగం లేదు అనుకున్న.. మా అమ్మ చెప్పిన వినిపించుకోలేదు.. హీరోయిన్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ (Bollywood) ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రజెంట్ సినీ, రాజకీయ రంగాల్లో బిజీగా ఉంది. ఇటీవల ‘ఎమర్జెన్సీ’ (Emergency) సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రేమికుల రోజు స్పెషల్‌గా కేఫ్‌ను స్టార్ట్ చేస్తూ.. ‘ఇది నా చిన్న నాటి కల.. ‘ది మౌంటెన్ స్టోరీ’ కేఫ్ కేవలం భోజనం చేసే ఒక ప్రదేశం కాదు.. నా తల్లి వంటగది’ అంటూ హిమాచల్‌ (Himachal)లోని మనాలి (Manali)లో కేఫ్‌ను స్టార్ట్ చేసింది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.

‘మా అమ్మా ఎప్పుడు ఒక మాట చెప్పేది. ఒక మహిళగా ఇంటి పనులు, వంట పనులు నేర్చుకోవాలి అని. అప్పుడు ఆవిడ మాటలు నాకు తెలివితక్కువగా అనిపించేది. ఊరగాయ పెట్టడం, నెయ్యి తయారు చేయడం, కూరగాయలు పండించడం నేర్యుకోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదనుకున్నాను. అంతే కాదు.. దేశంలోనే చిన్న వయసులో ధనవంతురాలైన మహిళల్లో నేను ఒకదాన్ని అని అనుకునేదాన్ని. ఆ మాటలకు అర్థం ఏంటో ఇప్పుడు తెలసింది. అందుకే నేను ఈ రోజు కేఫ్ స్టార్ట్ చేశారు. ఈ రోజు మా అమ్మ ఎంతో సంతోషంగా ఉంది. నేను నిజంగా ఎదిగాను అని, తెలివైన దాన్ని ఇప్పుడు గర్వపడుతోంది మా అమ్మా’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ కంగనా కామెంట్స్ వైరల్ కావడంతో.. మీ కొత్త జీవితానికి ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story

Most Viewed