పుష్ప మూవీ షూటింగ్‌లో అల్లు అర్జున్ ముందు ఆమెను జానీ మాస్టర్ కొట్టాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్ (వీడియో)

by Kavitha |   ( Updated:2024-09-22 14:48:07.0  )
పుష్ప మూవీ షూటింగ్‌లో అల్లు అర్జున్ ముందు ఆమెను జానీ మాస్టర్ కొట్టాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: లైంగిక వేధింపుల కేసులో (sexual assault case) అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రఫర్‌ జానీ మాస్టర్‌ (Johnny Master)పై తెలుగు హీరోయిన్, బీజేపీ నాయ‌కురాలు మాధవీలత(Madhavilatha) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దుమారం రేపుతోంది. అందులో భాగంగా జానీ అనే వాడికి కొంత‌మంది స‌పోర్ట్ చేస్తున్నారు. అందులో జ‌న‌సేన నాయ‌కుడు నటుడు నాగబాబు(Nagababu) కూడా ఉన్నాడు. నాగబాబు గారు మీకు కూడా ఒక కూతురు ఉంది. మీరు ఇలా మాట్లాడ‌టం స‌రికాదు. మీ అమ్మాయి కంటే చాలా చిన్న‌పాప ఆ అమ్మాయి. జానీ అనే వాడు మీ వ‌ర‌కు మంచి వ్య‌క్తి కావ‌చ్చు కానీ ఆ అమ్మాయి విష‌యంకు వ‌చ్చేస‌రికి మంచి వ్య‌క్తి కాడు. దానికి సాక్ష్యంగా నేనున్నాను.

పుష్ప 2 (Pushpa2)సినిమా సాంగ్ షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు అక్క‌డికి జానీ వ‌చ్చి చాలా పెద్ద ర‌చ్చ చేశాడు. ఆ షూటింగ్‌లోనే జానీ మాస్టర్ ఆమెను కొట్టాడు. సుకుమార్(Sukumar) గారు దానికి పంచాయితీ పెట్టి క్లియర్ చేశాడు. ఈ విష‌యం అల్లు అర్జున్‌(Allu Arjun)కు తెలుసు కాబట్టే ఆ అమ్మాయికి బ‌న్నీ అండ‌గా నిల‌బ‌డ్డాడు. రీసెంట్‌గా విశ్వ‌క్‌సేన్ మూవీ సాంగ్ జరుగుతున్నప్పుడు కూడా అక్క‌డికి వ‌చ్చి ర‌చ్చ రచ్చ చేశాడు. నన్ను పెళ్లి చేసుకో.. ఐ లవ్ యు.. ఐ మిస్ యు అంటూ ఆమెను టార్చ‌ర్ పెడుతున్నాడు. ఆ టార్చ‌ర్ భ‌రించలేకే అత‌డి నుంచి దూరంగా వ‌చ్చి సెపరేట్‌గా సినిమాలు చేసుకుంటుంది. అవును ఆ అమ్మాయి అతనితో ఒక 6నెలలు రిలేషన్‌లో ఉంది. అది కూడా ఆమెకు తెలిసి తెలియని ఏజ్‌లో. అలా ఉండటానికి కూడా కారణం కెరీర్ సెటిల్ అవుతుందని కావొచ్చు మరేదైనా కావచ్చు. సినీ ఇండస్ట్రీలో ఇదంతా కామన్. కానీ ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయి వెంట పడటం చాలా తప్పు. కాబట్టి ఎవ‌రు అయితే జానీకి స‌పోర్ట్ చేస్తున్నారో వాళ్లంద‌రూ త‌ప్పు చేస్తున్న‌ట్లే. ఇప్ప‌టికైనా మారండి అంటూ మాధవీలత సంచలన వీడియో విడుద‌ల చేసింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

(video link credits to telugu scribe X account)

Advertisement

Next Story