- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Janhvi Kapoor : స్టార్ డైరెక్టర్‌తో జాన్వీకపూర్ వెబ్ సిరీస్..?

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor).. ఇప్పటికే ‘దేవర’(Devara) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక త్వరలో దేవర పార్ట్ 2తో పాటు.. రామ్ చరణ్(Ramcharan) RC16తో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించేందుకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ వెబ్ సిరీస్ చేయనున్నట్లు ఇన్ సైడ్ టాక్. తమిళ స్టార్ డైరెక్టర్ పా. రంజిత్(Director Pa. Ranjith) తెలుగులో సినిమాలు తియ్యనప్పటికీ ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘మద్రాస్, కబాలి, కాలా, తంగలాన్’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను, గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన త్వరలో వెబ్ సిరీస్‌ను తెరకెక్కించే ప్లానింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు కూడా పూర్తి అయినట్లు తెలుస్తుండగా.. ఇందులో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. అంతే కాకండా.. స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను పాపులర్ ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే.. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
- Tags
- janhvi kapoor