- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Jailer-2: ‘జైలర్-2’ నుంచి సాలీడ్ అప్డేట్.. హైప్ పెంచేస్తున్న న్యూస్

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajanikanth) నటించిన ‘జైలర్’(Jailer) సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెల్సన్ దిలీప్(Nelson Dilip) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఏకంగా రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసింది. అనిరుద్(Anirudh) ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ క్రమంలో తాజాగా ‘జైలర్- 2’(Jailer-2) సినిమా కూడా ఉంటుందని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సినిమా టీజర్ ను విడుదల చేశారు.
అయితే జైలర్ 1లో రజనీకాంత్‌తో కలిసి రమ్యకృష్ణ(Ramya Krishna), వినాయకన్, తమన్నా భాటియా(Tamanna Bhatia), వసంత్ రవి(Vasanth Ravi), మీర్నా మీనన్, యోగి బాబు(Yogi Babu) నటించారు. ఇదే టీమ్ ఇప్పుడు జైలర్ 2లోనూ కనిపించనున్నారు. ఈ సినిమాను కూడా యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నెల్సన్. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మించనుంది.
ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ సాలీడ్ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈరోజు నుండి రెండు వారాల షెడ్యూల్ రజిని పై మొదలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు వారాలు తర్వాత మరో షెడ్యూల్‌లో రజనీకాంత్ లేని సీన్స్‌ని ఇతర ఆర్టిస్ట్‌లతో మేకర్స్ తెరకెక్కించునున్నారట. అంతేకాదు ఈ మూవీలో కూడా పార్ట్1 లానే చాలా మంది స్టార్స్ కనిపించనున్నారట. కాగా దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
READ MORE ...
‘జాట్’ నుంచి రణ్‌దీప్ హుడా ఫస్ట్ లుక్ రిలీజ్.. చేతిలో మొండెంతో సుస్సు పోయిస్తున్నాడుగా..