Sunny Deol: ‘జాట్’ మూవీ టీజర్ విడుదల.. యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టిన సన్నీ డియోల్ (వీడియో)

by Hamsa |   ( Updated:2024-12-06 11:34:01.0  )
Sunny Deol: ‘జాట్’ మూవీ టీజర్ విడుదల.. యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టిన సన్నీ డియోల్ (వీడియో)
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్(Sunny Deol) నటించిన ‘గదర్-2’ మూవీ గత ఏడాది థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. ‘బోర్డర్-2’ ప్రాజెక్ట్‌తో పాటు టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ‘జాట్’ (Jaat)మూవీ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇందులో రెజీనా(Regina Cassandra), సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. రణ్‌దీప్ హుడా విలన్‌గా కనిపించనున్నాడు. అయితే దీనికి ఎస్ తమన్(Thaman) సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అందరిలో క్యూరియాసిటీ(Curiosity)ని పెంచింది. తాజాగా, చిత్రబృందం ‘జాట్’ మూవీ టీజర్‌ను విడుదల చేసింది. సన్నీ డియోల్ యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టారు. మొత్తానికి ఈ టీజర్(Teaser) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Next Story