Bandla Ganesh: అలాంటి వారి వల్ల సినిమాలకు సమస్య రావడం దారుణం.. బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Hamsa |
Bandla Ganesh: అలాంటి వారి వల్ల సినిమాలకు సమస్య రావడం దారుణం.. బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ విశ్వక్ సేన్(Vishwak Sen), రామ్‌ నారాయణ్‌(Ram Narayan) కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘లైలా’. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్(Shine screen) బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. అయితే ఇందులో ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. విశ్వక్ సేన్ ఎన్నడూ లేని విధంగా లేడీ గెటప్‌లో నటిస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ‘లైలా’ చిత్రం లవర్స్ డే కానుకగా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల.. నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 150 గొర్రెలు, 11 గొర్రెలు అంటూ నటుడు పృథ్వీరాజ్‌(Prithviraj) చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా చర్చనీయాంశమయ్యాయి.

దీంతో ఈ కామెంట్స్‌కి హర్ట్ అయిన వైసీపీ నేతలు బాయ్ కాట్ లైలా (#Boycott Laila) హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. అది చూసి దెబ్బకు విశ్వక్ సేన్‌కు వణుకు పుట్టింది. విడుదలకు ముందే సినిమాను కిల్ చేసేలా ఉన్నారే అని ఖంగారు పడ్డాడు. అతనితో మాకు ఏ సంబంధం లేదు.. అసలు ఆ సీన్ కూడా సినిమాలో లేదు.. అతను ఎందుకు అలా చెప్పాడో మాకు తెలీదు అని క్షమాపణలు చెప్పారు. తాజాగా, బండ్ల గణేష్(Bandla Ganesh) ఈ కాంట్రవర్సీ పై స్పందింస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘రాజకీయం సినిమా రంగాలు ఒకటిగా చూడకూడదు.

రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీ,నటులు సినిమా వేదికలపై రాజకీయాలు చేయకూడదు. ఇలాంటి వారి విషయం లో నిర్మాతలు జాగ్రత్త వహించాలి. నటించిన వారి నోటి దూలకు సినిమా లకు సమస్య రావడం దారుణం. సినిమా ను సినిమాగా చూడండి.. విశ్వక్‌సేన్‌కు ఆల్ ది బెస్ట్’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా మరీ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా ఇదే వర్తిస్తుంది అది గుర్తు పెట్టుకో అని కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed