- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇలాంటివి వినాలంటే బాధగా ఉంది.. నటీనటుల పారితోషికంపై స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్!

దిశ, సినిమా: ఇటీవల చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీపై దారుణంగా కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అసలు ఇండస్ట్రీలోని సినిమాల్లో వివాహ వ్యవస్తను తప్పుగా చూపిస్తున్నారని ఇటీవల కంగనా రనౌత్ (Kangana Ranaut) కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం(John Abraham) బాలీవుడ్ ఇండస్ట్రీలోని రెమ్యునరేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనను యాంకర్ బాలీవుడ్‌లో రోజుకి కోట్లలో పారితోషికం డిమాండ్ చేస్తున్నారు అని ప్రశ్నించగా.. ‘‘భారీ పారితోషికం అంటే నవ్వొస్తుంది. ఆ భారీ రెమ్యునరేషన్ ఇప్పటికే బాలీవుడ్ మార్కెట్‌ని దెబ్బతీశాయి.
భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కించే సినిమాలపై నటుల భారీ పారితోషికాలు ఇంకాస్త ఒత్తిడిని పెంచుతున్నాయి. అసలు అది వింటేనే హాస్యాస్పదంగా ఉంది. నటులు నిజంగానే డిమాండ్ చేస్తున్నారా లేదంటే ఏజెంట్స్ ఇలాంటివి వ్యాప్తి చేస్తున్నారా, నటులు డిమాండ్ చేయడమే కాదు.. కొంతమంది నిర్మాతలు కూడా భారీగా నటులకు ఆశ చూపిస్తున్నారు. ఎంతంటే.. అంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దాని వల్ల ఇండస్ట్రీకి నష్టమే కానీ లాభం ఉండదు. ఒక నటుడిగా నేను ఇలాంటి వింటున్నాను అని చాలా బాధపడుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. జాన్ అబ్రహం సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది ‘వేద’ చిత్రంలో ప్రేకుల అలరించారు. ప్రస్తుతం ఆయన ‘ది డిప్లొమాట్’(The Diplomat) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం మార్చి 14న విడుదల కావాల్సి ఉంది. అలాగే ‘తెహ్రాన్’ మూవీ కూడా చేస్తున్నారు.