అమలాపాల్ ఇంత సడెన్‌గా పెళ్లి చేసుకోవడానికి రీజన్ అదేనా..?

by Hamsa |   ( Updated:2023-11-06 10:51:03.0  )
అమలాపాల్ ఇంత సడెన్‌గా పెళ్లి చేసుకోవడానికి రీజన్ అదేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో ఇటీవల చాలా మంది పెళ్లి చేసుకుంటారు. అలాగే కొందరు హీరోయిన్లు రెండో పెళ్లి కూడా చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్ అదే లిస్టులోకి చేరిపోయింది. ఈ అమ్మడుకి ఇది వరకే పెళ్లి జరిగింది. భర్తతో విడాకులు తీసుకుని విడిపోయిందని సమాచారం. ఇటీవల డైరెక్టర్ జగత్ దేశాయ్‌లో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అమలా పాల్ బర్త్ డే అక్టోబర్ 26న జగత్ ప్రపోజ్ చేయడంతో ఆమె కూడా దానిని ఒప్పుకుంది. అప్పుడు పంచుకున్న వీడియోలో వీళ్ళు రింగులు కూడా మార్చుకున్నారు.

కాగా, నవంబర్ 5న సడెన్ పెళ్లి చేసుకున్నట్లు కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ప్రేమ గురించి తెలిపాక కరెక్ట్‌గా 10 రోజుల్లో ఈ అమ్మడు పెళ్లి చేసుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, అమలా పాల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట సంచలనంగా మారింది. అమలా పాల్ ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఆమె ప్రెగ్నెంట్ అయిందని అందుకే ముందే పెళ్లి చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఇలా సడన్గా రాత్రికి రాత్రి ముహూర్తాలు పెట్టి పెళ్లి చేసేసుకుంది అని చెప్పుకొస్తున్నారు. అలాగే ఆమె శరీరంలో మార్పులు కూడా వచ్చాయని వాదిస్తున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ అమలా పాల్ మాత్రం కేరళలో నవంబర్ 5న గ్రాండ్‌గా పెళ్లి చేసుకుని మీ ఆశీర్వాదాలు కావాలని కోరుతూ ఓ పోస్టు షేర్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story