‘విశ్వంభర’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఆ స్పెషల్ డే నాడే ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుందంటూ ట్వీట్!

by Hamsa |
‘విశ్వంభర’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఆ స్పెషల్ డే నాడే ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుందంటూ ట్వీట్!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. ఇక 2023లో ఆయన నటించి భోళా శంకర్, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలతో వచ్చారు కానీ హిట్ అందుకోలేకపోయారు. ఇక ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మళ్లీ సంవత్సరం తర్వాత ‘విశ్వంభర’ (Vishwambhara)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి వశిష్ఠ(Vasishtha) దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఇందులో స్టార్ హీరోయిన్ త్రిష, అషిక రంగనాథ్(Ashika Ranganath) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే షూటింగ్ మొదలై ఏడాది అవుతున్నప్పటికీ పోస్టర్స్ మాత్రమే విడుదల చేశారు. కానీ ఏ అప్డేట్ ఇవ్వకపోవడంతో అసలు మూవీ ఉటుందా.. లేక మధ్యలోనే ఆగిపోయిందా అనే సందిగ్ధంలో పడిపోయారు. ఈ క్రమంలో.. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ శ్రీరామ నవమి పండుగ నాడు విడుదల కాబోతున్నట్లు సమాచారం.

రామ రామ అంటూ సాగే ఈ సాంగ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేయగా.. ఇందులోనే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా జాయిన్ అయినట్లు తెలుస్తోంది. అయితే దీనికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిచినట్లు ఈ రామ రామ పాట సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలవనున్నట్లు టాక్. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా, మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’తో పాటు యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కూడా ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవరిస్తుండగా.. కొత్త జానర్‌లో రాబోతున్నట్లు టాక్. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలవగా అందరిలో క్యూరియాసిటీని పెంచేసింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ రాణి ముఖర్జీ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed