Anushka: అడవిలో అనుష్క పోరాటాలు.. ‘ఘాటీ’పై పెరుగుతోన్న ఎక్స్‌పెక్టేషన్స్

by sudharani |
Anushka: అడవిలో అనుష్క పోరాటాలు.. ‘ఘాటీ’పై పెరుగుతోన్న ఎక్స్‌పెక్టేషన్స్
X

దిశ, సినిమా: అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఘాటీ’ (Ghati). ఫిమేల్ ఓరియెంటెడ్ (Female oriented) సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే తమిళ నటుడు విక్రమ్ ప్రభు (Vikram Prabhu) కీ రోల్ పోషిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అనుష్క ఫస్ట్ లుక్ (First look), గ్లింప్స్‌ (glimpses)కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. దీంతో ‘ఘాటీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో రిలీజ్ సమయం దగ్గరలోనే ఉండటంతో షూటింగ్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే మూవీ షూటింగ్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో గంజాయి అక్రమ రవాణా హైలైట్‌గా ఉంటుందని టాక్. అంతే కాకుండా దీనికి సంబంధించిన చిత్రీకరణ కూడా అడవుల్లో నిర్వహిస్తున్నారట చిత్ర బృందం. ఇందులో భాగంగా అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్, ఛేజింగ్ సన్నివేశాల విషయంలో అనుష్క ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నటిస్తుందట. రియల్ అడవి ప్రాంతాల్లో డూప్ లేకుండా రియల్ స్టంట్స్‌తో అదరగొడుతుందని సమాచారం. ఈ సన్నివేశాల చిత్రీకరణకు డైరెక్టర్ క్రిష్ డూప్ ఫైటర్లను తీసుకుందామంటే.. అనుష్క నో చెప్పడమే కాకుండా తానే స్వయంగా చేస్తానంటూ ప్రత్యేక ట్రైనింగ్ కూడా తీసుకుందని టాక్. ఇక ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుంటే.. అనుష్క ‘ఘాటీ’ కోసం ఎంతో కష్టపడుతుంది.. ఈ సినిమా తనకు మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలి అంటూ కామెంట్స్ చేస్తు్న్నారు ఫ్యాన్స్.

Next Story