- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘చలో మహాకల్’ పాటలో శివలింగాన్ని హత్తుకోవడం పై పూజారుల ఆగ్రహం.. స్టార్ హీరో రియాక్షన్ ఇదే

దిశ, వెబ్‌డెస్క్: హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న మూవీని.. అవా ఎంటర్‌టైన్మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్, శరత్ కుమార్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
కాగా ఈ మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ప్రతి సోమవారం ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీనీ పెంచుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి హిందీ టీజర్ విడుదల చేశారు. అయితే ఆయన ‘చలో మహాకల్’(CHALO MAHAKAL) పాటలో శివ లింగాన్ని కౌగిలించుకుంటాడు. లింగానికి అభిషేకం చేసినప్పుడు ఆ ద్రావణాలు లింగాన్ని హగ్ చేసుకున్న అక్షయ్ కుమార్ పై కూడా పడతాయి.
ఈ సన్నివేశంపై పూజారి సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే తాజాగా దీనిపై ఆయన స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘పార్వతి, శివుడు నా తల్లి తండ్రులతో సమానం. చిన్నప్పటి నుంచి వారిని నా పేరేంట్స్‌గా భావిస్తున్నాను. వారిని ప్రేమగా కౌగిలించుకుంటే తప్పేముంది. ఎవరైనా నా భక్తిని తప్పుగా అర్థం చేసుకుంటే అది నా తప్పు కాదు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.