- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘తండేల్’ నుంచి హార్ట్ టచింగ్ సాంగ్ ఫుల్ వీడియో అవుట్.. ట్వీట్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తాజా సినిమా ‘తండేల్’(Thandel). చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. అల్లు అరవింద్(Allu aravind) సమర్పణలో బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించారు. ఇక రిలీజ్ కాక ముందు నుంచే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ఆకట్టుకుని చిత్రంపై భారీ అంచనాలు పెంచగా.. సాంగ్స్ మాత్రం సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
అలా విడుదలకు ముందే క్యూరియాసిటీని పెంచిన ఈ చిత్రం లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 7న భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఫస్ట్ షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంటూ దూసుకుపోయింది. అంతేకాకుండా కలెక్షన్ల విషయంలోనూ నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. అయితే ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్‌కి ఫుల్ మార్క్స్ పడ్డాయి. అలాగే దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) తన మ్యూజిక్‌తో అదరగొట్టేశాడు.
అయితే విడుదలకు ముందు నుంచే బాగా ఫేమస్ అయిన సాంగ్ ఏదైనా ఉంది అంటే బుజ్జి తల్లి పాట అనే చెప్పాలి. ఈ సాంగ్ యూట్యూబ్‌లో ఎక్కువమంది విన్న లిస్ట్‌లోకి కూడా చేరిపోయింది. అలాగే ఇప్పటికీ యూత్ ప్లే లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లోనే ఉందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి అంతటి ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ అయింది. మరి ఒకసారి ఫుల్ వీడియోను కూడా చూసేయండి.