Tollywood Producer: సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టిన ఏకైక టాలీవుడ్ నిర్మాత అతనొక్కడే!

by Prasanna |
Tollywood Producer: సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టిన ఏకైక టాలీవుడ్ నిర్మాత అతనొక్కడే!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి సంక్రాంతికి ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలాగే ఈ పొంగల్ కి కూడా మూడు స్టార్ హీరో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే, టాలీవుడ్ ( Tollywood ) లో ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సంక్రాంతికి వచ్చినప్పుడు ఓడింది లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ రికార్డు అతనికి మాత్రమే దక్కుతుంది. అతనెవరో ఇక్కడ తెలుసుకుందాం..

దిల్ రాజు ( Dil Raju ) నిర్మాణంలో 2013లో మహేష్ , వెంకటేష్ హీరోలుగా నటించిన " సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు " ( Seethamma Vakitlo Sirimalle Chettu ) ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇక, అప్పటి నుంచి ఇదే సెంటిమెంట్ ను ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ గెలుస్తూ వస్తున్నాడు. డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాతగా మారి తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు.

2014 సంక్రాంతి రేసులో దిగిన " ఎవడు " కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 2017లో మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ " శతమానం భవతి "ని తీసుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు దిల్ రాజు. 2019లో ఎఫ్ 2ని తో మరో బ్లాక్ బస్టర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత 2020 లో మహేష్‌తో " సరిలేరు నీకెవ్వరు " తీసి బ్లాక్ బస్టర్ చూడని కలెక్షన్లు చూశాడు దిల్ రాజు. 2023లో ఇళయదళపతి విజయ్‌తో " వారిసు "ను పొంగల్ రేసులో దింపి స్టార్టింగ్ లోనే పెద్ద విజయం అందుకున్నాడు. 2025 సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్ లో , రామ్ చరణ్ హీరోగా నటించిన " గేమ్ ఛేంజర్ " ( Game Changer ) , " సంక్రాంతి వస్తున్నాం" రాగా, డాకు మహారాజ్ నైజాం హక్కులను తీసుకుని డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఈ ఫెస్టివల్‌కు అసలైన పండుగను ఎంజాయ్ చేస్తున్నాడు.

Next Story

Most Viewed