- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అతను నన్ను ఎంతో వేధించాడు.. రిలేషన్‌షిప్ పై వెంకటేష్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్

దిశ, సినిమా: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) ‘రాంబంటు’(Rambantu) చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. రీసెంట్‌గా అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో మాత్రం ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక వెంకటేష్(Venkatesh) హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) కూడా నటించింది. ఇక దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(SVC) బ్యానర్ పై దిల్ రాజు(Dil Raju) నిర్మించారు.
అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయి.. బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు కలెక్షన్ల పరంగా ట్రెండ్ సెట్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ నలుగురు పిల్లల తల్లిగా, వెంకటేష్ భార్య నటించిందన్న సంగతి తెలిసిందే. ఆమె నటనకు తెలుగు ఆడియన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ.. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ తన రిలేషన్ షిప్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “నా తల్లి నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను. నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోయారు. దీంతో అమ్మ ఒక్కరే ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచింది. అయితే ఈ ప్రయాణంలో ఆమె మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడింది. చిన్న వయసులోనే పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేశాను. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టాను. అయితే లవ్ కంటే బ్రేకప్ అయినప్పుడు వచ్చే బాధ అంటే నాకు చాలా భయం.
ప్రేమించే సమయం కంటే అది మిగిల్చే బాధ నుంచి బయటకు రావడానికే ఎక్కువ సమయం తీసుకుంటాను. గతంలో సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఓ వ్యక్తిని ప్రేమించాను. అతను నన్ను ఎంతో వేధించాడు. అంతకంటే ముందు కూడా అలాంటి ప్రేమనే చూశాను, అసలు రిలేషన్‌షిప్‌లో ఎందుకు ఇలా జరుగుతుందని చాలా భయపడ్డాను. ప్రస్తుతానికి ఎటువంటి రిలేషన్స్ లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఐశ్వర్య రాజేష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.