Gopichand : హిస్టారికల్ చిత్రంతో రాబోతున్న మాచో స్టార్.. పూజాకార్యక్రమాలతో సినిమా స్టార్ట్

by sudharani |   ( Updated:2025-03-10 17:53:53.0  )
Gopichand : హిస్టారికల్ చిత్రంతో రాబోతున్న మాచో స్టార్.. పూజాకార్యక్రమాలతో సినిమా స్టార్ట్
X

దిశ, సినిమా: మాచో స్టార్ గోపీచంద్ (Gopichand), విజనరీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) కాంబోలో ఓ మూవీ రాబోతుంది. ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ హిస్టారికల్ ఎపిక్ (Historical Epic) మూవీని తాజాగా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. లాంచింగ్ ఈవెంట్‌కి కోర్ టీం, ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ మూవీలో గోపీచంద్‌ నెవర్ బిఫోర్ రోల్‌ (Never Before Roll)లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 7వ శతాబ్దంలో జరిగే ఈ సినిమా ఒక ముఖ్యమైన, ఇంకా అన్వేషించబడని చారిత్రక సంఘటనని ప్రేక్షకుల ముందుకు అద్భుతంగా తీసుకొస్తోంది.

భారతీయ వారసత్వ మరచిపోయిన అధ్యాయానానికి జీవం పోస్తుంది అని చెబుతున్నారు మేకర్స్. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ (Top Technicians) పని చేస్తున్నారు. HIT 1, HIT 2, గీత గోవిందం (Geeta Govindam), సైంధవ్ (Saindhav) వంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన మణికంధన్ ఎస్ డీవోపీగా పని చేస్తున్నారు. చిన్నా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. పృథ్వీ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. కాగా.. IB 71 (స్కై బ్యాక్ డ్రాప్), ఘాజీ (వాటర్ బ్యాక్ డ్రాప్) అంతరిక్షం (స్పెస్ బ్యాక్ ట్రాప్) చిత్రాలతో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు పొందిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్షన్‌లో ఈ మూవీ రాబోతుండటంతో ప్రేక్షకుల్లో ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.


Also Read..

నటి రష్మికకు భద్రత కల్పించండి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ

Next Story

Most Viewed