Balakrishna: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. సమ్మర్ స్పెషల్‌గా రీరిలీజ్ కాబోతున్న హిట్ మూవీ

by Hamsa |   ( Updated:2025-02-26 08:13:24.0  )
Balakrishna: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. సమ్మర్ స్పెషల్‌గా రీరిలీజ్ కాబోతున్న హిట్ మూవీ
X

దిశ, సినిమా: కొద్ది కాలంగా స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అవుతూ బాక్సాఫీసును షేక్ చేస్తున్నాయి. ప్రతి నెల ఓ నాలుగు చిత్రాలైనా మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా, నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటించిన తొలి భారతీయ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య -369’ రీరిలీజ్‌కు సిద్ధమైనట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ ద్వారా ‘ఆదిత్య-369’ మరోసారి థియేటర్స్‌లోకి రానున్నట్లు వెల్లడించారు. నేటి సాంకేతికతలకి అనుగుణంగా డిజిటలైజ్ చేసి ఈ సమ్మర్ స్పెషల్‌గా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలపడంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. టైమ్ ట్రావెట్ కాన్సెప్ట్ నేపథ్యంలో వచ్చిన మొదటి సినిమాగా పేరొందిన ‘ఆదిత్య-369’ శ్రీనివాసరావు(Srinivasa Rao) తెరకెక్కించారు.

అయితే దీనిని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్(Sivalenka Krishnaprasad), బాలసుబ్రమణ్యం నిర్మించారు. ఈ మూవీకి ఇళయరాజా అద్భుతమైన సంగీతం అందించారు. అయితే ఈ సినిమా 1991లో థియేటర్స్‌లోకి వచ్చి బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు రీరిలీజ్ కాబోతుండటం విశేషం. ఈ మేరకు దీనిపై స్పందించిన డైరెక్టర్.. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే ఈ సినిమాను డిజిటల్ 4Kలో ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దాం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్నీ వయసుల వారిని, నందమూరి అభిమానులని అలరించిన ఈ చిత్రాన్ని మళ్లీ థియేటర్లలోకి తీసుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో మంచి చిత్రాలు తెరకెక్కించిన నాకు, మా నిర్మాణ సంస్థకి ఓ గొప్ప గుర్తింపు, అద్భుతమైన పునాది ‘ఆదిత్య 369’. ఈ సమ్మర్‌లో గ్రాండ్‌గా రీ రిలీజ్ చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed