Sree Vishnu: ఒంటరి వాడిని నేను.. కానీ ఇద్దరు లవ్ చేస్తున్నారు.. ఇంట్రెస్టింగ్‌గా ‘సింగిల్’ గ్లింప్స్

by sudharani |   ( Updated:2025-02-10 15:31:57.0  )
Sree Vishnu: ఒంటరి వాడిని నేను.. కానీ ఇద్దరు లవ్ చేస్తున్నారు.. ఇంట్రెస్టింగ్‌గా ‘సింగిల్’ గ్లింప్స్
X

దిశ, సినిమా: హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) ప్రజెంట్ ‘SV18’తో బిజీగా ఉన్నాడు. ‘నిను వీడిని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి ‘సింగిల్’ (Single) అనే టైటిల్‌ను ఫిక్స్ చేయగా.. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ మేరకు ‘ఒంటరి వాడిని నేను.. ఎవ్వరి వాడిని కాను... కానీ ఇద్దరు లవ్ చేస్తున్నారు.. కాని నేను సింగిల్’ అంటూ విడుదల చేసిన ఈ గ్లింప్స్‌ (Glimpses)లో ‘35 ఏళ్లు వచ్చిన నాకు ఇంకా పెళ్లి కాలేదంటే దానికి కారణం ఆ నాకొడుకే.. దరిద్రానికి దత్తపుత్రుడు నా చిన్ననాటి మిత్రుడు’ అని హిలేరియస్‌గా వివరిస్తున్న వెన్నెల కిషోర్ (Vennela Kishore) డైలాగ్‌తో టైటిల్ గ్లింప్స్ ప్రారంభమవుతుంది.

ఇక వాలెంటైన్స్ డే (Valentine's Day) రోజున ఒక పార్కులోకి లవర్స్ కూర్చుని ఎంజాయ్ చేస్తుంటారు. ఇంతలో అక్కడ క్రాకర్స్ పేలడంతో భయంతో పరుగులు పెడతారు. ఆ పొగలోనుంచి శ్రీ విష్ణు మ్యూజిక్ సిస్టమ్ (Music system) చేతిలో పట్టుకుని ‘ఒంటరి వాడిని నేను.. ఎవ్వరి వాడిని కాను’ అనే సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తోంది. అంతే కాకుండా ప్రేమ విషయంలో అంత వైలెంట్‌గా ఉన్న శ్రీవిష్ణుని ఇద్దరు వేర్వేరు అమ్మాయిలు ప్రేమిస్తున్నప్పటికీ, అతను ఒంటరిగా ఉండటం, సినిమా టైటిల్ ‘సింగిల్’ రివిల్ అవ్వడం క్యురియాసిటీ పెంచింది. కాగా.. ‘నిను వీడని నీడను నేనే’ ఫేం కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు.

Next Story

Most Viewed