- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఊ అంటావా..' సాంగ్ సెన్సువల్ మూవ్స్‌కు సమంత న్యాయం చేసింది : గణేష్ ఆచార్య
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య..'పుష్ప' మూవీ ఐటెం సాంగ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'ఊ అంటావా మామ' పేరుతో అల్లు అర్జున్, సమంతపై తెరకెక్కిన హాట్ నంబర్ టాలీవుడ్‌ను ఊపేసిన సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ పాటలో బన్నీ, సామ్ పర్ఫార్మెన్స్కు హ్యూజ్ కాంప్లిమెంట్స్ దక్కగా.. కొరియోగ్రఫీ చేసిన గణేష్ ఆచార్య వాళ్లిద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు. 'సినిమా డిసెంబర్ 17న విడుదల కావాల్సి ఉండగా అల్లు అర్జున్ నాకు 15 రోజుల ముందు కాల్ చేసి సాంగ్ చేయాలని చెప్పాడు. షార్ట్ గ్యాప్ ఉండటంతో నా క్యాటరాక్ సర్జరీ వాయిదా వేసుకుని ఈ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేశాను' అన్నారు.
ఇక సమంత గురించి ప్రస్తావిస్తూ.. 'ఈ పాటను సడెన్‌గా ప్లాన్ చేయడం వల్ల ఆమె చాలా నెర్వస్‌గా ఉంది. కొరియోగ్రఫీ నేను చేస్తానని ముందుగా తెలియదు. వేరెవరో చేస్తారని ఊహించారు. కానీ బన్నీ స్వయంగా కాల్ చేయడంతో కొరియోగ్రఫీకి ఒప్పుకున్నాను. ఇక ఈ పాటను ఎలా చేయాలనుకుంటున్నామో? ఎలా చేస్తామో ముందుగానే వారికి వివరించాను. తర్వాత సెన్సువల్ మూవ్‌మెంట్స్‌పై రెండు రోజుల పాటు రిహార్సల్ చేశాక షూటింగ్ స్టార్ట్ చేశాం. మొత్తానికి ఇద్దరూ పాటకు న్యాయం చేశారు' అని తెలిపారు.