Sakshi Mahdolkar: మోగ్లీ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్.. అమ్మోరు అవతారంలో భయపెడుతున్న బ్యూటీ

by sudharani |
Sakshi Mahdolkar: మోగ్లీ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్.. అమ్మోరు అవతారంలో భయపెడుతున్న బ్యూటీ
X

దిశ, సినిమా: సుమ కనకాల తనయుడు రోషన్ (Roshan Kanakala) నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ’ (Mowgli). ‘కలర్ ఫొటో’ (Color photo) ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్ (Sandeep Raj) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఇప్పటికే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ (Bollywood) బ్యూటీ సాక్షి మడోల్కర్ (Sakshi Mahdolkar) హీరోయిన్‌గా నటిస్తుంది. అంతకు ముందు పలు బ్రాండ్స్‌కు చెందిన యాడ్స్‌లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు మోగ్లీ చిత్రంతో ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధం అయింది. తాజాగా ‘మోగ్లీ’ నుంచి సాక్షి మడోల్కర్ ఫస్ట్ లుర్ రిలజ్ చేశారు మేకర్స్.

ఈ మేరకు సాక్షి తన ఇన్‌స్టా (Insta) వేదికగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంటూ.. ‘మా మోగ్లీ యొక్క హృదయాన్ని మీకు అందిస్తున్నాము. సాక్షి మడోల్కర్‌ని జాస్మిన్‌గా పరిచయం చేస్తున్నాము. ఇది మీకు 2025లో ఇష్టమైన స్త్రీ పాత్ర కానుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. అతి త్వరలో షూట్ ప్రారంభించడానికి రెడీగా ఉన్నాము’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ పోస్టర్‌లో సాక్షి మడోల్కర్ త్రిశూలం పట్టుకుని అమ్మోరు రూపంలో ఉగ్రంగా కనిపించి మెస్మరైజ్ చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed