Devi Sri Prasad: అందరూ చాలా మెసేజ్‌లు చేస్తున్నారు.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తానంటున్న దేవిశ్రీ ప్రసాద్ (వీడియో)

by Hamsa |
Devi Sri Prasad: అందరూ చాలా మెసేజ్‌లు చేస్తున్నారు.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తానంటున్న దేవిశ్రీ ప్రసాద్ (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్(Devisree Prasad) వరుస సినిమాల్లో తన మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. 45 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచ్‌లర్‌గానే ఉన్నారు. ఇక ఇటీవల ‘పుష్ప-2’(Pushpa– 2 ) ఆయన మ్యూజిక్ అందించిన ఫీలింగ్స్ సాంగ్ గంగమ్మజాతర ఇలా అన్ని సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక దేవిశ్రీ ‘తండేల్’(Thandel)చిత్రంలోని బుజ్జితల్లి సాంగ్‌కు మ్యూజిక్ అందించారు. ఈ సాంగ్ విడుదలకు ముందే యూట్యూబ్‌ను షేక్ చేయడంతో పాటు ఎంతో మంది మనసులు గెలుచుకుంది. అలాగే పలు రికార్డులను బ్రేక్ చేసింది. అలాగే సినీ సెలబ్రిటీలను కూడా కదిలించిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన ఈ సినిమాకు చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు ‘తండేల్’లో హైలెట్‌గా నిలిచాయి.

ఇక ఈ చిత్రాన్ని శ్రీకాకుళంలోని ఓ ఊరులోని మత్సకారుల జీవితం ఆధారంగా వచ్చింది. ఫిబ్రవరి 7న థియేటర్స్‌లో విడుదలైన ‘తండేల్’ ఘన విజయాన్ని సాధించింది. అంతేకాకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్‌కి బుకింగ్స్ పెరిగాయి. శని, ఆదివారాల్లో తండేల్ హంగామానే కనిపిస్తోంది. తండేల్ టికెట్లు గంటగంటకి పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు మంచి టాక్‌ను సొంతం చేసుకోవడంతో ‘తండేల్’కు వర్క్ చేసిన వారంతా తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, దేవి శ్రీ ప్రసాద్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘హాయ్ అందరికీ మా ‘తండేల్’ మూవీని సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చేసినందుకు. మా తండేల్ రాజు మా బుజ్జితల్లిని ఎంత లవ్ చేస్తున్నారో అంతలా మీరు కూడా నా సాంగ్‌ను ప్రేమిస్తున్నారు.

దానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు చాలామంది మెసేజ్‌లు చేస్తున్నారు. కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా చేశారు. ముఖ్యంగా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి విపరీతమైన మెసేజ్‌లు వస్తున్నాయి. డైరెక్టర్లు, నిర్మాతలు అందరూ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నాగచైతన్య, సాయి పల్లవి, చందూ మొండేటి అందరికీ థాంక్స్. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే త్వరలోనూ గుడ్ న్యూస్ చెప్తాను. సినిమాలో బుజ్జి తల్లి ఫీమేల్ వర్షెన్, స్యాడ్ వర్షెన్, ఇంకో చిన్న బిట్ సాంగ్ బాగుందని, వాటిని రిలీజ్ చేయండని అంతా డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే ఒక్కొక్కటిగా వాటిని రిలీజ్ చేస్తాము’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story