నిహారిక విడాకులు తీసుకున్నా.. నాగబాబు కూల్‌గా ఉండడానికి కారణం ఇదే..!

by Hamsa |   ( Updated:2023-11-12 10:29:24.0  )
నిహారిక విడాకులు తీసుకున్నా.. నాగబాబు  కూల్‌గా ఉండడానికి కారణం ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక యాంకర్‌గా బుల్లితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. అయితే జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇటీవల విడాకులు తీసుకుని భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఫొటోస్ షేర్ చేస్తుంది. అలాగే నిర్మాతగా మారి షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంది. ఈ మధ్యనే ఓ బిగ్ సినిమాకు తీయడానికి పూజలు కూడా నిర్వహించింది. ఇదిలా ఉంటే నిహారిక సంబంధించిన వార్తలు నిత్యం ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూనే ఉంటాయి.

తాజాగా, నిహారిక విడాకులు తీసుకుని ఇంట్లో ఉన్నా నాగబాబు కూల్‌గా ఉండటానాకి కారణం ఇదేనంటే ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. నాగబాబుకు తన కూతురు నిహారిక గురించి పూర్తిగా తెలుసట. కాబట్టి మన సైడ్ తప్పు లేనప్పుడు ఎలాంటి మిస్టేక్ మనం చేయనప్పుడు బాధ పడాల్సిన పని లేదన్న కారణంగా సంతోషంగా ఉంటున్నారని తెలుస్తోంది. అలాగే కూతురు బంగారం అని ఆమె మంచి స్థాయికి చేరుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారట. దీంతో నిహారికను ఏం అనకుండా దగ్గరకు తీసుకుని ఆదరిస్తున్నారట. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed