- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ లో ఎన్టీఆర్ తాగిన డ్రింక్ ఏంటో తెలుసా..?

దిశ, వెబ్‌డెస్క్ : బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా తెరకెక్కిన 'మ్యాడ్ స్క్వేర్'లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవల విడుదలై పెద్ద విజయం సాధించింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా 80 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో మూవీ మేకర్స్ సక్సెస్ ఈవెంట్ జరుపుకున్నారు. అయితే మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ స్పీచ్, ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
అయితే ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ గ్రీన్ కలర్ బాటిల్ ఉన్న ఓ డ్రింక్ తాగాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఎన్టీఆర్ తాగిన డ్రింక్ ఏంటి? దాని ధర ఎంత ఉంటుంది ? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేసేస్తున్నారు. అయితే ఆ డ్రింక్ కి సంబంధించిన వార్తలు కొన్ని బయటికి వచ్చాయి. ఎన్టీఆర్ తాగిన డ్రింక్ జస్ట్ వాటర్ మాత్రమే. ఇది సోడా టెస్ట్ లో ఉంటుంది. అలాగే పెరియల్ కంపెనీకి చెందిన కార్బోనేటెడ్ మినరల్ వాటర్ ..330 ml బాటిల్స్ లో దొరుకుతుంది. దీని ధర 145 నుంచి బల్క్ ఆర్డర్ లో తక్కువ ధరకే దొరుకుతాయి.