Kiran Abbavaram: దిల్‌రూబా రిలీజ్ డేట్ ఫిక్స్... అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన హీరో

by sudharani |
Kiran Abbavaram: దిల్‌రూబా రిలీజ్ డేట్ ఫిక్స్... అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన హీరో
X

దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), డైరెక్టర్ విశ్వకరుణ్ (Vishwakarun) కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘దిల్‌రూబా’ (Dilruba). రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ (romantic entertainer)గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివమ్ సెల్యూలాయిడ్ ప్రొడక్షన్స్ అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలింతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో రుక్సర్ థిల్లాన్ (Ruksar Dhillon) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్‌లో రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల చేత పోస్ట్ పోన్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు చిత్ర బృందం. ఈ మేరకు కిరణ్ అబ్బవరం తన సోషల్ మీడియా అకౌంట్ X వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. ‘ప్రేమికుల రోజు మిస్ అయింది .. హోలీ రోజు జరుపుకుందాం.. మార్చి 14న నా ప్రేమ నా కోపం’ అంటూ ‘దిల్‌రూబా’ చిత్రం మార్చి (March) 14న రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించాడు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed